105 ఏండ్ల బామ్మ పరుగు బంగారం

105 ఏండ్ల బామ్మ పరుగు బంగారం
  • నేషనల్​ మాస్టర్స్‌‌ అథ్లెటిక్స్‌‌లో  రెండు గోల్డ్‌‌ మెడల్స్‌‌తో రికార్డు

న్యూఢిల్లీ:  సాధించాలన్న తపనకు వయసు అడ్డుకాదనేందుకు  నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది హర్యానాకు చెందిన ఓ బామ్మ. ఆమె పేరు రాంబాయి. వయసు 105 ఏండ్లు. ఈ ఏజ్‌‌లో నడవడమే కష్టం. కానీ, ఆమె ట్రాక్‌‌పై పరుగులు పెడుతూ.. తనకంటే చిన్నవాళ్లను ఓడిస్తూ ఔరా అనిపిస్తోంది. వడోదరలో జరుగుతున్న నేషనల్ ఓపెన్‌‌ మాస్టర్స్​ అథ్లెటిక్స్‌‌లో 100మీ. స్ప్రింట్‌‌లో  నేషనల్‌‌ రికార్డు టైమింగ్‌‌ తో (45.40 సెకండ్లు) గోల్డ్‌‌ నెగ్గిన రాంబాయి తాజాగా 200మీ. ఈవెంట్‌‌లోనూ బంగారు పతకం  గెలిచింది. 1 నిమిషం 52.17 సెకండ్లతో రెండో గోల్డ్‌‌ ఖాతాలో వేసుకుంది. రాంబాయి తప్పితే ఈ టోర్నీలో 85 ఏండ్లకు మించిన వాళ్లు లేరు. ఇప్పటికే100మీ ఈవెంట్‌‌లో పోటీపడి, గోల్డ్‌‌ గెలిచిన ఇండియా ఓల్డెస్ట్‌‌  అథ్లెట్‌‌గా రాంబాయి రికార్డు సృష్టించింది. 101 ఏండ్ల వయసులో ఆమె ఈ ఘనత సాధించింది.