అయోధ్యలో108 అడుగుల అగరబత్తిని వెలిగించిన్రు

అయోధ్యలో108 అడుగుల అగరబత్తిని వెలిగించిన్రు

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఇంకా వారం రోజులే టైమ్ ఉంది.  ఈ మహా క్రతువుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఈ క్రమంలో  గుజరాత్ నుండి తీసుకువచ్చిన 108 అడుగుల పొడవాటి ధూపదీపాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ వెలిగించారు. జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేస్తూ  అగరబత్తిని వెలిగించారు. 

ఈ అగరబత్తి నుండి వచ్చే సువాసన 50 కి.మీ దూరం వరకు చేరుతుంది.  3 వేల 610 కిలోల బరువున్న అగరబత్తి సుమారు మూడున్నర అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది గుజరాత్ లోని వడోదర నుండి అయోధ్యకు తీసుకువచ్చారు.  191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్‌, 425 కిలోల హవాన్‌ మెటీరియల్‌, 1475 కిలోల ఆవు పేడ పొడిని ఉపయోగించి ఈ అగరబత్తిని తయారు చేశారు.

దీనిని తయారు చేసేందుకు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది.   ఒకసారి వెలిగిస్తే దాదాపు నెలన్నర పాటు ఉంటుంది.   తొలుత ఈ భారీ అగరబత్తిని తయారు చేయాలని సంకల్పించింది విహాభాయ్‌ అనే రైతు. అయనకు రాముడంటే అమితమై భక్తి ఉంది.  అయోధ్య రామమందిరంలో  శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు ప్రారంభమై జనవరి 21 వరకు నిరంతరాయంగా జరుగుతాయి. జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది.