టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ బాలికలే టాప్

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ బాలికలే టాప్
  • బాలికల ఉత్తీర్ణత 82.21 శాతం
  • బాలుర ఉత్తీర్ణత 78.42 శాతం

హైదరాబాద్: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సైఫాబాద్ లో ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఫలితాలు విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 79.82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి అయింది. 
బాలురు 78.42 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 82.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 48,167 మంది సప్లమెంటరీ పరీక్షలకు హాజరు కాగా..వారిలో 38,447 మంది ఉత్తీర్ణత సాధించారని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన తెలిపారు.