మూన్ మిషన్ కోసం 11 సంస్థలతో నాసా ఒప్పందం

మూన్ మిషన్ కోసం 11 సంస్థలతో నాసా ఒప్పందం

అమెరికా స్పేస్‌‌ సంస్థ నాసా చంద్రునిపైకి మనుషుల్ని పంపుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 కల్లా ఈ మిషన్‌‌ చేపట్టాలని సంస్థ భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఓ ప్రత్యేకత కూడా ఉంది. తొలిసారి ఓ మహిళ చంద్రునిపై అడుగు పెట్టబోతోంది. ప్రాజెక్టు కోసం11 కంపెనీలు సాయం చేస్తున్నాయని  నాసా తాజాగా వెల్లడించింది. వీటిల్లో బోయింగ్‌‌, స్పేస్‌‌ ఎక్స్‌‌, బ్లూ ఆరిజిన్‌‌ లాంటి పేరు మోసిన సంస్థలున్నాయంది. స్పేస్‌‌ క్రాఫ్ట్‌‌ డిజైన్‌‌, ప్రోటోటైప్‌‌ రీ ఫ్యూయెలింగ్‌‌ తదితరాల్లో నాసాకు ఇవి హెల్ప్‌‌ చేయనున్నాయి. వీటన్నింటితో రూ. 310 కోట్ల ఒప్పందాలను నాసా కుదుర్చుకుంది. మిషన్‌‌లో భాగంగా ‘గేట్‌‌ వే’ పేరుతో ఓ స్మార్ట్‌‌ స్టేషన్‌‌ను కూడా నాసా నిర్మిస్తోంది. ఇది ఆస్ట్రోనాట్లకు వే పాయింట్‌‌ లా ఉపయోగపడనుంది. మరి కొన్నేళ్లలో దీని తయారీ మొదలవనుంది. మరి 11 ఏం చేయబోతున్నాయి?

ఎరోజెట్‌ రాకెట్‌ డైన్‌‌

ఇది కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ.ప్రాజెక్టుకు సంబంధించి వెహికిల్‌ ట్రాన్స్‌‌ఫర్‌ వ్యవస్థపై పని  చేస్తోంది. లో ఎర్త్‌‌ ఆర్బిట్‌ కుఏడుగురు ప్యాసెంజర్లను ఈ స్టార్‌ లైనర్‌మోసుకెళ్లగలదు. డీప్‌ స్పేస్‌ లోకి తీసుకెళ్లే స్పేస్‌ క్రాఫ్ట్‌‌నూ తయారు చేస్తోంది.

స్పేస్‌‌ ఎక్స్‌‌

టెస్లా సీఈవో ఎలాన్‌‌ మస్క్‌‌ కంపెనీ స్పేస్‌‌ ఎక్స్‌‌.. చంద్రునిపైకి వెళ్లే మనుషులకు క్యాప్సుల్‌‌ తయారు చేసే పనిలో ఉంది. గత నెలలో చేపట్టిన ఈ క్రూ డ్రాగన్‌‌ క్యాప్సూల్‌‌ డ్రైవ్‌‌ విజయవంతం కాలేదు. క్యాప్సూల్‌‌ పేలిపోయింది.

మాస్టన్‌‌ స్పేస్‌‌ సిస్టమ్‌‌

కాలిఫోర్నియాకు చెందిన ఈ ఏరోస్పేస్‌‌ కంపెనీ డిసెంట్‌‌ ఎలిమెంట్‌‌ తయారీ పనిలో పడింది. ఇంతకుముందు రకరకాల స్పేస్‌‌క్రాఫ్ట్‌‌లు, ఇంజిన్ల తయారీలో దీని భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం ఎక్స్‌‌ ఎల్‌‌1 (ల్యూనార్‌‌ ల్యాండర్‌‌)ను తయారు చేస్తోంది. ఇది నాసా ‘కేటలిస్ట్‌‌’ ప్రాజెక్టులో భాగం.

నార్త్‌‌రాప్‌‌ గ్రుమ్మన్‌‌ ఇన్నోవేషన్‌‌ సిస్టమ్‌‌

ఈ కంపెనీ ఇంతకుముందే రోబోటిక్‌‌ స్పేస్‌‌క్రాఫ్ట్‌‌ల తయారీలో పాలు పంచుకుంది. చాలా స్పేస్‌‌ ట్రావెల్‌‌, ఎక్స్‌‌ప్లోరేషన్స్‌‌లకు పని చేసింది. ఇప్పుడు నాసాకు డిసెంట్‌‌ ఎలిమెంట్‌‌, రీఫ్యూయెలింగ్‌‌లో సాయపడుతోంది.

సియెర్రా నెవడా కార్పొరేషన్‌‌

యూఎస్‌‌లోని విస్కాన్సిన్‌‌కు చెందిన నెవెడా కార్పొరేషన్‌‌ గేట్‌‌వే స్టేషన్‌‌ తయారీలో బిజీగా ఉంది.రీఫ్యూయెలింగ్‌‌లో ఎస్‌‌ఎస్‌‌ఎల్‌‌, ఆర్బిల్‌‌ బియాండ్‌‌ అనే మరో రెండు కంపెనీలు పనిచేస్తున్నాయి.ప్రాజెక్టులో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి.

బ్లూ ఆరిజిన్‌

మనుషులను తిరిగి భూమిపైకి తీసుకురావడానికి అవసరమయ్యే క్రాఫ్ట్‌ను  బెజోస్‌ కంపెనీ  రెడీ చేస్తోంది. దీన్నే ట్రాన్స్‌ఫర్‌ వెహికిల్‌ అంటారు. ప్రొటోటైప్‌ను కూడా కంపెనీ రెడీ చేస్తోంది. బ్లూమూన్‌ ల్యాండర్‌ను ఇటీవలే ప్రకటించింది.

బోయింగ్‌‌

ట్రాన్స్‌‌ఫర్‌‌ వెహికిల్‌‌, రీ ఫ్యూయెలింగ్‌‌పై ఎయిరోస్పేస్‌‌ కంపెనీ బోయింగ్‌‌ పని చేస్తోంది. తన హ్యూమన్‌‌ ప్యాసెంజర్డ్‌‌ ఫ్లైట్‌‌ స్టార్‌‌లైనర్‌‌ను ఆగస్టులో ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. రక్షణ వ్యవస్థలో ఇబ్బందుల వల్ల ఈ పరీక్ష ఆలస్యమైంది.

డైనెటిక్స్‌‌‌‌

అమెరికాలోని అలబ్మా రాష్ట్రానికి చెందిన డైనటిక్స్‌‌‌‌ ఐదు డిసెంట్‌‌‌‌ ఎలిమెంట్ల తయారీలో నిమగ్నమైంది.  అమెరికా మిలిటరీకి హై ఎనర్జీ లేజర్‌‌‌‌ వెపన్‌‌‌‌ తయారు చేసి ఇచ్చేందుకు కూడా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.

లాక్‌‌హీడ్‌ మార్టిన్‌‌

ప్రముఖ వెపన్స్‌‌, డిఫెన్స్‌‌ కాంట్రాక్టర్‌‌ లాక్‌‌హీడ్‌‌ మార్టిన్‌‌ కూడా ట్రాన్స్‌‌ఫర్‌‌ వెహికిల్‌‌, రీ ఫ్యూయెలింగ్‌‌పై పని చేస్తోంది. నాలుగు డిసెంట్‌‌ ఎలిమెంట్‌‌ ప్రోటోటైప్‌‌లను రెడీ చేస్తోంది. నాసా గేట్‌‌వే ప్రాజెక్టుకూ సహకరిస్తోంది. మనుషులను డీప్‌‌ స్పేస్‌‌లోకి తీసుకెళ్లే ఓరియన్‌‌ ప్రాజెక్టులోనూ పాలు పంచుకుంటోంది.