Viral Video: మొదలైన రామాయణ్ షూట్.. రూ.11 కోట్లతో భారీగా అయోధ్య సెట్

Viral Video: మొదలైన రామాయణ్ షూట్.. రూ.11 కోట్లతో భారీగా అయోధ్య సెట్

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు నితేశ్ తివారి(Nitesh Tiwari) రామాయణ(Ramayan) ఇస్తిహాసాన్నీ సినిమాగా తీస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాలో లెవల్లో భారీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమాలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ కనిపిస్తుండగా.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. 

అయితే.. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలైందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోందని సమాచారం. దాదాపు రూ.11 కోట్లతో వేసిన అయోధ్య నగర సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అత్యంత భారీ ఖర్చుతో వేసిన ఈ సెట్ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామాయణ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో వివిధ భాషలకు సంబందించిన స్టార్స్ కనిపించనున్నారని టాక్. 

కేజిఎఫ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో యష్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే ఈ విషయంపై మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. బాలీవుడ్ నుండి కూడా స్టార్ కాస్ట్ ఈ సినిమా కోసం పనిచేయనున్నారట. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.