బిల్డింగ్ కుప్పకూలి 11మంది మృతి

V6 Velugu Posted on Jun 10, 2021

ముంబైలో భారీ వర్షానికి రాత్రి ఓ బిల్డింగ్ కూలి 11 మంది చనిపోయారు. మలాడ్  వెస్ట్  ఏరియాలోని న్యూకలెక్టర్  కాంపౌండ్ లో ఈ ప్రమాదం జరిగింది. గాయాలైన వారిని స్థానిక హాస్పిటళ్లకు తరలించారు. మహిళలు, పిల్లలతో కలిపి 18 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు ఫ్లోరుల బిల్డింగ్ పక్కనున్న మరో బిల్డింగ్ పై పడటంతో ప్రమాదం జరిగిందన్నారు అధికారులు. దగ్గర్లోని మరో 2 బిల్డింగులు కూడా పాతబడి పోవడంతో అందులో వాళ్లను ఖాళీ చేయించామన్నారు.

రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో రెస్య్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో పాటు స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రాత్రి 11 గంటల టైంలో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బిల్డింగ్ కూలిపోవడంతో స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. 

Tagged Mumbai, 11 dead, 7 Injured , 2-Storey Building Collapses, Malvani Area

Latest Videos

Subscribe Now

More News