బీసీ సంక్షేమంలోని 11మందికి డీబీసీడీఓలుగా ప్రమోషన్‌‌‌‌

బీసీ సంక్షేమంలోని 11మందికి డీబీసీడీఓలుగా ప్రమోషన్‌‌‌‌
  • ఉత్తర్వులు జారీచేసిన సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 11 మంది జిల్లా బీసీ సంక్షేమాధికారులకు ప్రమోషన్లు లభించాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవన్నీ అడ్ హక్ బేస్డులో ఉంటాయని ప్రకటించారు. కాగా, జూన్ 30న 13 మందికి ప్రమోషన్లు ఇచ్చేందు కు డీపీసీ ఆమోదం తెలిపింది. అయితే, ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో గతనెల 28న ‘డీబీసీడీఓ ప్రమోషన్లపై అయోమయం’ హెడ్డింగ్​తో వెలుగు దినపత్రిక అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. 

దీంతో రిటైర్డ్ అయ్యే రోజున ఇద్దరికి ప్రమోషన్ కల్పించారు. మిగిలిన 11 మందికి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీజోన్ 1లో ఆరుగురు, 2లో ఐదుగురికి ప్రమోషన్లు లభించాయి. కాగా, ఇందిర (భూపాలపల్లి), సంపూర్ణ (-సిరిసిల్ల), సయ్యద్ రఫీక్ (సిద్దిపేట), సునీత ( బీసీ కమిషన్), విజయ లక్ష్మి (కొత్తగూడెం), కె.జైరాజ్(కామారెడ్డి), ముజాహిద్ ఖాన్ (వన పర్తి), నర్సిములు (సూర్యాపేట), అక్బర్ పాషా (గద్వాల), మాధవ్ రెడ్డి (వికారాబాద్‌‌‌‌), లక్ష్మి నరసింహ రావు (జనగామ) పోస్టింగులు ఇచ్చారు.