కరోనాతో అమెరికాలో మనవాళ్లు 11 మంది మృతి

కరోనాతో అమెరికాలో మనవాళ్లు 11 మంది మృతి

వాషింగ్టన్: కరోనాతో అమెరికాలో మనవాళ్లు 11 మంది చనిపోయారు. మరో 16 మందికి పాజిటివ్ వచ్చింది. మృతుల్లో 10 మంది న్యూయార్క్, న్యూజెర్సీకి చెందినవాళ్లని, నలుగురు న్యూయార్క్ సిటీలో ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. ఫ్లోరిడాలో ఒక ఇండియన్ చనిపోయినట్లు అధికారులు చెప్పారు. 16 మంది కరోనా పాజిటివ్ బాధితుల్లో నలుగురు మహిళలు ఉన్నారని, న్యూయార్క్ లో 8, న్యూజెర్సీలో ముగ్గురు, మిగిలినవారంతా టెక్సాస్, కాలిఫోర్నియాకు చెందినవారని, వారంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. మృతులు, బాధితులు ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్ కు చెందినవారు. ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నందున లోకల్ ఆఫీసర్లే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని, చాలా కేసుల్లో ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా అనుమతించట్లేదని అధికారులు చెప్పారు. బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు యూఎస్ అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కొవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఒక్క సిటీలోనే 1.38 లక్షల మంది బాధితులు ఉండగా, 6 వేల మంది మరణించారు. న్యూజెర్సీలో 1,500 మంది చనిపోగా, 48 వేల మందికిపైగా వైరస్ సోకింది. అమెరికాలో 4 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.14 వేల మందికిపైగా మరణించారు.