11 ఏళ్ల పిల్లాడితో బౌలింగ్ వేయించుకున్న రోహిత్ శర్మ

11 ఏళ్ల పిల్లాడితో బౌలింగ్ వేయించుకున్న రోహిత్ శర్మ

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బౌలర్లు...టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బౌలింగ్ వేసేందుకు ఇష్టపడుతుంటారు.  రోహిత్ శర్మకు బౌలింగ్ వేస్తే చాలు జన్మ ధన్యం అని అనుకునే బౌలర్లూ ఉన్నారు. ఇక వరల్డ్ వైడ్గా ఎంతో మంది బౌలర్లను ఎదుర్కొని ...వేల పరుగులు సాధించిన రోహిత్ శర్మ...11 ఏళ్ల పిల్లాడి బౌలింగ్కు ఫిదా అయ్యాడు. గొప్ప బౌలర్లను ఉతికారేసిన హిట్ మ్యాన్...బ్రిస్బేన్లో బాలుడి బౌలింగ్కు ఆకర్షితుడయ్యాడు. 

రోహిత్ శర్మ ముచ్చటపడ్డాడు..


టీ20 వరల్డ్ కప్లో భాగంగా టీమిండియా పెర్త్‌లోని వాకా స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. అప్పటికే స్టేడియంలో వందల మంది పిల్లలు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూం నుంచి పిల్లల ప్రాక్టీస్ ను చూస్తున్నారు. ఈ సమయంలో దృశిల్ చౌహాన్ అనే పిల్లాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటపడ్డాడు. అతని లెఫ్టార్మ్ బౌలింగ్ కు హిట్ మ్యాన్ ఫిదా అయ్యాడు. ఆ బాలుడు బంతులు విసురుతున్న తీరుతో..రోహిత్ శర్మ ముచ్చటపడ్డాడు. వెంటనే ఈ చిన్నోడిని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. నెట్స్ లో తనకు బౌలింగ్ వేయమన్నాడు. కొద్దిసేపు దృశిల్ తో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ తర్వాత దృశిల్ కు రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది.

భారత్ తరపున ఆడతా..
రోహిత్ శర్మకు బౌలింగ్ వేస్తున్న సమయంలో ..దృశిల్ను రోహిత్ శర్మ ప్రశ్నించాడు. పెర్త్లో ఉంటున్న నువు..టీమిండియాకు ఎలా ఆడతావన్నాడు. దీనికి బదులిచ్చిన దృశిల్...తాను భారతదేశం వెళ్తానని..అయితే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానోలేదో తెలియదన్నాడు. 

నాన్న చెప్పిందే జరిగింది..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బౌలింగ్ వేయడం తన అదృష్టమని దృశిల్ చౌహాన్ అన్నాడు. తనను చూసి..రోహిత్ శర్మ బౌలింగ్ వేయమని చెప్పాడని..అది తనకు ఆశ్యర్యం అనిపించిందని చెప్పుకొచ్చాడు. అయితే ఒక రోజు ముందే తాను రోహిత్ శర్మకు కూడా బౌలింగ్ వేయగలవని నాన్న చెప్పాడని..అప్పుడు తాను ఎంతో ఉత్సాహంగా ఫీలయ్యానని తెలిపాడు. చివరకు నాన్న అన్నదే జరిగిందని..తర్వాతి రోజే రోహిత్ శర్మకు బౌలింగ్ చేసే ఛాన్స్ వచ్చిందన్నాడు. తనకు ఇన్ స్వింగింగ్ యార్కర్ ఫేవరెట్ బాల్ అని.. దృశిల్ చౌహాన్ చెప్పుకొచ్చాడు.