పార్కులో ఆడుకుంటుండగా 11 ఏళ్ల బాలుడి పై కుక్క దాడి

 పార్కులో ఆడుకుంటుండగా 11 ఏళ్ల బాలుడి పై కుక్క దాడి

11 ఏళ్ల బాలుడిపై పిట్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి మొహానికి దాదాపు 200 కుట్లు పడ్డాయి. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. గత వారం తన ఇంటి సమీపంలోని పార్కులో ఆడుకుంటున్న బాలుడిపై  పిట్ బుల్ కుక్క దాడి చేసింది. దాడి చేసిందంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.  ఓ బాలిక కుక్కను తీసుకొని పార్కులో నడుస్తుండగా.. అకస్మాత్తుగా పిల్లవాడిపై  ఆ కుక్క దాడి చేసినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఆ బాలుడిని రక్షించాడు.

ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా కుక్కను పార్కులో ఉంచిన యజమానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు  రూ. 5,000 జరిమానా విధించారు ఈ ఘటన పై స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. పిల్లలు ఆడుకోవడానికి వచ్చే పార్కుల వద్ద జంతువులను విడిచిపెట్టడం సరికాదంటూ తెలిపారు.  ఉత్తరప్రదేశ్‌లో  పెంపుడు కుక్కల దాడికి సంబంధించిన రెండు దిగ్భ్రాంతికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.