మలేషియా నుంచి చెన్నై చేరిన 113 మంది ఇండియన్లు

మలేషియా నుంచి చెన్నై చేరిన 113 మంది ఇండియన్లు

కరోనా వైరస్‌కు భయపడి ఇప్పటికే పలు దేశాలలో ఉన్న మనవాళ్లు ఇండియాకు చేరారు. తాజాగా మలేషియాలో చిక్కుకున్న 113 మంది భారతీయులు సోమవారం రాత్రి 10:30 గంటలకు చెన్నైకి చేరుకున్నారు. కరోనా వ్యాప్తి దేశంలో పెరుగుతండటంతో భారత ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే విమానాలను నిషేధించింది. దాంతో మనవాళ్లు చాలామంది చాలా దేశాలలో చిక్కుకున్నారు. ఆ విధంగానే మలేషియాలో చిక్కుకున్న భారతీయులను ఎయిర్ ఏషియా విమానంలో చెన్నైకి తీసుకువచ్చారు. వారందరిని ఎయిర్ పోర్టులో పరీక్షించిన తర్వాత తంబారాంలో ఏర్పాటు చేసిన ఎయిర్ ఫోర్స్ క్వారంటైన్ ఫెసిలిటీకి తరలించారు. మలేషియా నుంచి వచ్చిన వారిలో 9 మందికి కరోనా లక్షణాలు ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతావారిని 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచుతారు. కరోనా వల్ల ఈ విధంగా మలేషియా నుంచి మనవాళ్లు ఇండియాకు రావడం ఇది మూడో బ్యాచ్.

కరోనా వైరస్ వల్ల భారతదేశంలో ఇప్పటివరకు 492 కరోనావైరస్ కేసులు నమోదుకాగా.. 9 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 80వేల పాజిటివ్ కేసులు రాగా.. 16 వేల మందికి పైగా మరణించారు.

For More News..

కరోనా కట్టడికి విరాళమిచ్చిన హీరో నితిన్

పరీక్షలు లేకుండా పైతరగతులకు పంపే యోచనలో ప్రభుత్వం

కరోనా దెబ్బకు మూతపడ్డ ప్రముఖ మొబైల్ ప్లాంట్

డీఎస్పీపై కేసు నమోదు.. ఫారెన్ నుంచి వచ్చిన కొడుకు విషయం దాచినందుకే..

కాలిఫోర్నియా బీచుల్లో జనం జల్సాలు