
శరత్ చంద్ర తడిమేటి దర్శకుడిగా రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న చిత్రం ‘1134’. కృష్ణ మడుపు, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
గెస్ట్‌గా హాజరైన నందు మాట్లాడుతూ ‘నేను శరత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఫ్రెండ్‌షిప్ డే నాడు ఇలా రావడం ఆనందంగా ఉంది. జీరో బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నాడు.
శరత్ చంద్ర మాట్లాడుతూ ‘నో బడ్జెట్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ చేశాం. దీనికి మేం ఏమీ ఖర్చు పెట్టలేదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు సెన్సార్ కూడా పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ఇలాంటి డార్క్ సబ్జెక్ట్‌ను అందరూ చూడాలని ఎలాంటి వల్గారిటీ లేకుండా తీశాం. ఇప్పుడు జరుగుతున్న స్కాంల గురించి చూపిస్తున్నాం’అని అన్నాడు.