రాష్ట్రంలో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు

రాష్ట్రంలో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు అయిన‌ట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 117 కేసుల్లో 66 మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా.. ఇద్దరు వలస కార్మికులు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మంది కరోనా బారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అలాగే, కరోనాతో గురువారం నలుగురు చనిపోయారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 67కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 844 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 1345 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు.