మీకు నచ్చినా నచ్చకపోయినా గ్రీన్ లాండ్స్ స్వాధీనం చేసుకుంటాం : తేల్చిచెప్పేసిన ట్రంప్

మీకు నచ్చినా నచ్చకపోయినా గ్రీన్ లాండ్స్ స్వాధీనం చేసుకుంటాం : తేల్చిచెప్పేసిన ట్రంప్

గ్రీన్​ లాండ్​, డెన్మార్క్​ లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఫైనల్​ వార్నింగ్ ఇచ్చారు. గ్రీన్​ లాండ్ స్వాధీనం విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా.. అడ్డుకోవాలని చూస్తే బలవంతంగానైనా  గ్రీన్​ లాండ్​ ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యర్థి దేశాలైన చైనా, రష్యాలను స్వాదీనం చేసుకోకముందే గ్రీన్​ లాండ్​ ను మేమే కొనుగోలు చేస్తామన్నారు ట్రంప్​. 

గ్రీన్​ లాండ్​ డెన్మార్క్​ కు చెందిన స్వతంత్ర్య భూభాగమని తప్పుగా చెబుతన్నప్పటికీ..ఇప్పటికే చైనా,రష్యన్​ యుద్ద నౌకలు గ్రీన్​ లాండ్​ చుట్టూ మోహరించాయి.. ఈ సమయంలో మేం అలా చేయకపోతే రష్యా లేదా చైనా గ్రీన్​ లాండ్ ను స్వాధీనం చేసుకుంటారు. ఆర్కిటిక్​ సర్కిల్​ లో అమెరికాకు గ్రీన్​ లాండ్​ వ్యూహాత్మక ప్రాంతమని ..స్వాధీనం తప్పదని తేల్చేశారు ట్రంప్​. 

Also Read : మోదీ ఫోన్ చేయనందుకే..ట్రంప్ ఈగో హర్ట్

 
సంప్రదింపుల ద్వారా గ్రీన్​ లాండ్​ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాం..అది సాధ్యపడకపోతే సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకుంటామని డెన్మార్క్​, గ్రీన్​ లాండ్​ ను హెచ్చరించారు ట్రంప్​. 

గ్రీన్​ లాండ్ స్వాధీనంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్థన 19, 20 శతాబ్దాల ప్రారంభంలో అమెరికా అవలంభించిన సామ్రాజ్యవాద విధానాలకు అద్దంపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 1915లో హైతిని అమెరికా సైనిక చర్యతో ఆక్రమించినప్పుడు జర్మనీ, ఫ్రాన్స్​ ముందుగా ఆ దేశాన్ని ఆక్రమించబోతున్నాయని అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్​ చెప్పడం.. ఇప్పుడు గ్రీన్​ లాండ్​ పై ట్రంప్​ వ్యాఖ్యలు అమెరికా ధోరణిని స్పష్టం చేస్తున్నాయి.

అయితే గ్రీన్‌‌లాండ్ విషయంలో అమెరికాకు డెన్మార్క్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బుల్లెట్​ దింపిన తర్వాతే ప్రశ్నలు అడుగుతామంటూ వార్నింగ్ ఇచ్చింది. గ్రీన్‌‌లాండ్ ద్వీపాన్ని కొంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లపై డెన్మార్క్ తీవ్రంగా స్పందించింది. 2019లోనూ ఆయన ఇదే తరహా కామెంట్లు చేశారని ఫైర్ అయింది.

గ్రీన్​లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఘాటుగా స్పందించింది. ‘ఎవరైనా (అమెరికా బలగాలు) మా అనుమతి లేకుండా గ్రీన్‌‌లాండ్ గడ్డపై కాలు పెడితే, చర్చలు జరపం.. నేరుగా కాల్పులు జరుపుతాం (యుద్ధం చేస్తాం) అని డెన్మార్క్‌‌కు చెందిన ఓ సీనియర్ డిఫెన్స్ ఆఫీసర్ హెచ్చరించారు. ఒక నాటో మిత్రదేశమైన అమెరికాను ఉద్దేశించి డెన్మార్క్ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే ఫస్ట్ టైమ్.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపు ఆర్కిటిక్ ద్వీపం గ్రీన్‌లాండ్‌పై పడటం..ఈ ద్వీపంపై పట్టు కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు.. ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలను కమ్మేలా చేస్తున్నాయి. డెన్మార్క్ పరిధిలో ఉండే ఈ స్వయంప్రతిపత్తి గల భూభాగాన్ని దక్కించుకోవడానికి అమెరికా సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని సంకేతాలు ఇవ్వడంతో.. డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తన సైనికులకు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆర్కిటిక్ సర్కిల్​ హాట్ టాపిక్​ గా మారింది.