బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో కరోనా కలకలం

బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో కరోనా కలకలం

బాన్సువాడ  బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో కరోనా కలకలం రేపింది.  కళాశాలలోని 12 మంది విద్యార్థినిలకు కరోనా పాజిటివ్ గా నిర్థరణ అయింది. దీంతో వసతి గృహం  ప్రత్యేక గదుల్లో విద్యార్థులు హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకునన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... విద్యార్థులను పరామర్శించారు. హాస్టల్ కు వచ్చి విద్యార్థుల స్థితి గతుల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలను స్టూడెంట్స్ కు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం కొవిడ్ ఎఫెక్ట్ అంతగా లేదన్న ఆయన... విద్యార్థులు భయపడొద్దని తెలిపారు.