వామ్మో.. బుసకొడుతున్న 12 అడుగుల కింగ్ కోబ్రా

వామ్మో.. బుసకొడుతున్న 12 అడుగుల కింగ్ కోబ్రా

క‌ర్నాట‌క‌ ఫారెస్ట్ అధికారులు సుమారు 12 అడుగులు ఉన్న కింగ్ కోబ్రాను నివాస ప్రాంతంలో పట్టుకున్నారు. అగుంబే గ్రామ ప‌రిస‌రాల్లో సంచ‌రిస్తున్న పెద్ద పామును బంధించి, అడవిలో వదిలారు. అగుంబే రెయిన్‌ఫారెస్ట్ రీస‌ర్చ్ స్టేష‌న్‌లో ఫీల్డ్ డైరెక్టర్‌గా చేస్తున్న అజ‌య్ గిరి ఆ స‌ర్పానికి చెందిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత్ నందా కూడా ఆ వీడియోను షేర్ చేశారు.

ఆ పాము రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు స్థానికులు చూశారు. 12 అడుగులు ఉన్న పెద్ద కింగ్ కోబ్రాను చూసి జనం షాక్ తిన్నారు. తర్వాత అది ఓ ఇంటి కాంపౌండ్‌లోకి వెళ్లి చెట్టుపైకి ఎక్కింది.  గ్రామ‌స్థులు వెంట‌నే అటవీ అధికారుల‌కు సమాచారం ఇచ్చారు. వాళ్ల టీంతో అజయ్ గిరి వ‌చ్చి పామును ప‌ట్టేశారు. ఆ త‌ర్వాత రెస్క్యూ బ్యాగ్‌లోకి పంపించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Giri (@ajay_v_giri)