ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడండి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడండి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

మైక్రోసాఫ్ట్ లో టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు  విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.  ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు గాస్తున్నారు. ఇటు దేశ వ్యాప్తంగా కూడా పలు విమానాలు క్యాన్సిల్ అయ్యాయి.  ఈ సమస్యపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు... మైక్రోసాఫ్ట్ లో వచ్చిన సమస్యతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. అనుకోని సమస్యతో ఇబ్బంది వచ్చిందన్నారు.

విమానాశ్రయాల్లో వేచిచూస్తున్నవారికి ఫుడ్, మంచినీళ్లు అందించాలని.. అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరు సహనంతో ఉంటూ.. అధికారులకు సహకరించాలని కోరారు రామ్మోహన్ నాయుడు.

ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం 6గంటలపాటు మెక్రోసాఫ్ట్ సర్వర్ల డౌన్ అయ్యాయి.  దీంతో ఎయిర్ పోర్ట్ లో విమానయానం, బ్యాంకింగ్ ట్రాన్ జాక్షన్స్, స్టాక్ ఎక్స్చేంజ్ యాక్టివిటీస్, పలు ఎమర్జెన్సీ సర్వీసులు నిలిచిపోయాయి. ఫ్లైట్లు క్యాన్సల్ అయ్యాయి.  దేశ వ్యాప్తంగా 35కు పైగా విమానాలు రద్దు అయ్యాయి.  అంతేగాకుండా  ఎయిర్‌పోర్టులో డిస్‌ప్లే బోర్డులు కూడా పనిచేయడం లేదు. మాన్యువల్ బోర్డు ఏర్పాటు చేశారు  అధికారులు.  ఏయే విమానాలు రద్దు అయ్యాయో వాటి వివరాలను  బోర్డులపై రాస్తున్నారు. 

 బోర్డింగ్ పాసులను కూడా చేతితో రాసి ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్ కావటంతో.. బోర్డింగ్ పాసులపై ఈ ప్రభావం పడిందని.. ఫ్లయిట్స్ లేటు అవ్వకుండా.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బోర్డింగ్ పాసులను చేతితో రాసి ఇస్తున్నట్లు వెల్లడించారు ఎయిర్ పోర్టు అధికారులు.