
- గత ఏడాది తో పోలిస్తే 24 శాతం పెరిగిన ఇన్కం
- దరఖాస్తుల పరిష్కారంలోనూ ముందే..
హైదరాబాద్సిటీ, వెలుగు : ఈ ఏడాది తొమ్మిది నెలల్లో హెచ్ఎండీఏ భవన నిర్మాణాలు, లేఔట్స్పర్మిషన్లు, విల్లాల నిర్మాణాలకు అనుమతులను మంజూరు చేయడం ద్వారా రికార్డు స్థాయిలో 1,225 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుందని అధికారులు తెలిపారు. 2024తో పోలిస్తే 24 శాతం (రూ.355 కోట్లు), 2023తో పోలిస్తే 82శాతం (రూ.674 కోట్లు) పెరుగుదల ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 6,079 దరఖాస్తులు పరిష్కరించామని, 2024లోని మొదటి తొమ్మిది నెలలతో పోలిస్తే 49 శాతం, 2023తో పోలిస్తే 36 శాతం అధికమని వెల్లడించారు.
బిల్డింగుల పర్మిషన్ల కోసం 2,961 దరఖాస్తులు వచ్చాయని, 2024తో పోలిస్తే 18 శాతం, 2023తో పోలిస్తే 8 శాతం పెరిగిందన్నారు. 2024తో పోలిస్తే 47 శాతం, 2023తో పోలిస్తే 26 శాతం బిల్డింగ్ అనుమతులు పెరిగాయన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకే 88.15 లక్షల చదరపు మీటర్లకు పైగా బిల్ట్ అప్ ఏరియాకు అనుమతులు ఇచ్చినట్టు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్కమిషనర్సర్ఫరాజ్అహ్మద్తెలిపారు.
దరఖాస్తుల పరిష్కారంలోనూ..
దరఖాస్తులను పరిష్కారంలోనూ హెచ్ఎండీఏ మంచి ఫలితాలు సాధించిందని సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 6,079 ఫైళ్ళు పరిష్కరించామని, ఇది 2024తో పోలిస్తే 49 శాతం, 2023తో పోలిస్తే 36 శాతం అధికమన్నారు. రెండు నెలలు, నెల, వారం ఇలా పెండింగ్లో ఉన్న ఫైళ్లను విభజించి ఎప్పటికప్పుడు పరిష్కరించే విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు.