తెలుగురాష్ట్రాల్లో  ఎగ్జామ్​ రాసిన 12 లక్షలమంది పదో తరగతి విద్యార్థులు

తెలుగురాష్ట్రాల్లో  ఎగ్జామ్​ రాసిన 12 లక్షలమంది పదో తరగతి విద్యార్థులు

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం (మార్చి 18) ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా  పదోతరగతి పరీక్షలు ఈ రోజు ( మార్చి 18)  ఉదయం 9.30 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 2 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించడంతో అధికారులు తెలపడంతో విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు 9.35 నిమిషాల వరకు విద్యార్ధులను ఆయా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,676 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 5 లక్షల 8 వేల 385 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. తెలంగాణ లో హాల్‌ టికెట్లు చూపించిన విద్యార్ధులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తోంది.

పదో  పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ. కృష్ణారావు తెలిపారు.2,676 మంది చీఫ్ సూపరింటెండెంట్లు..  2,676 డిపార్ట్‌మెంటల్ అధికారులు...   పరీక్ష విధుల కోసం 30 వేల  మంది ఇన్విజిలేటర్లను నియమించారు.మాల్‌ప్రాక్టీస్ కేసులను అరికట్టేందుకు అధికారులు 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు సిట్టింగ్ స్క్వాడ్‌లను కూడా ఏర్పాటు చేశారు.


ఆంధ్రప్రదేశ్​ లో ...

ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 6 లక్షల 23 వేల 092 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 1,02,528 మంది గతంలో పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షా సమయంగా అధికారులు నిర్దేశించారు. రాష్ట్రంలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన 130 సెంటర్లలో సీసీ టీవీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. మాల్‌ ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు క్యూఆర్‌ కోడ్‌లు ముద్రించిన ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అందించారు. ప్రస్తుతం విద్యార్ధులంతా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారని  ఏపీ పాఠశాల విద్యా కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.  

ALSO READ :- దేశంలో ఫస్ట్ టైం అక్కడ ఎత్తైన అపార్ట్‪మెంట్స్‭లో పోలింగ్ బూత్‫లు

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 3,473 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు...... 3,473 డిపార్ట్‌మెంటల్ అధికారులు..... 35,119 . ఇన్విజిలేటర్లు .నియమించారు.  130 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.అవకతవకలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 682 సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. పేపర్ లీకేజీలు, అవకతవకలను అరికట్టేందుకు అధికారులు యూనిక్ కాన్ఫిడెన్షియల్ కోడెడ్ ప్రశ్నపత్రాలను అందజేస్తున్నారు. . ఆంధ్రప్రదేశ్​ లో  కూడా హాల్‌ టికెట్లు చూపించిన విద్యార్ధులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తోంది.