సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలు

సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలు

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలను ఇండియాకు తరలించనున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌ తెలిపారు. ఇండియన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ (ఐఏఎఫ్‌‌‌‌)కు చెందిన సీ17 ఎయిర్‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌లో చీతాలను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌ గురువారం సౌతాఫ్రికాకు బయలుదేరిందని, ఈ నెల 18న ఉదయం 10 గంటలకు చీతాలు ఇండియాకు చేరుకుంటాయని చెప్పారు.  వీటిలో 7 మగ, 5 ఆడ చీతాలున్నాయని తెలిపారు. వీటికోసం మధ్యప్రదేశ్‌‌‌‌లోని కునో నేషనల్‌‌‌‌ పార్క్‌‌‌‌లో పది క్వారంటైన్‌‌‌‌ ఎన్‌‌‌‌క్లోజర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.