రాష్ట్రానికి 12 జాతీయ అవార్డులు

రాష్ట్రానికి 12 జాతీయ అవార్డులు
  • ఉత్తమ జిల్లా పరిషత్​గా మెదక్
  • ఉత్తమ మండల పరిషత్​లుగా కోరుట్ల, ధర్మారం
  • దీన్​దయాళ్​ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

రాష్ట్రానికి 12 జాతీయస్థాయి అవార్డులు దక్కాయి. ఉత్తమ మండల పరిషత్​లుగా జగిత్యాల జిల్లా కోరుట్ల, ధర్మారం మండలాలకు పురస్కారాలు వచ్చాయి.  ఉత్తమ జిల్లా పరిషత్​గా మెదక్ ఎంపికైంది. ఉత్తమ పంచాయతీలుగా 9  గ్రామాలు ఎంపికయ్యాయి.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి 12 జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కార్ అవార్డులు బుధవారం ప్రకటించింది. మూడు కేటగిరీల్లో రాష్ట్రానికి 12 అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ మండల పరిషత్​లుగా జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మారం మండలాలకు పురస్కారాలు వచ్చాయి. జనరల్ కేటగిరీలో ఉత్తమ జిల్లా పరిషత్​గా మెదక్ ఎంపికైంది. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా 9  గ్రామాలు..  క‌రీంన‌గ‌ర్ జిల్లా తిమ్మాపూర్ మండ‌లంలోని పర్లపల్లి, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ‌లం హరిదాస్​ నగర్, సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం మల్యాల్, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి, మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం చక్రపూర్, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండ‌లం మోహినికుంట, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామాలు అవార్డులకు ఎంపికయ్యాయి. సుందిళ్ల పంచాయతీకి డెవలప్​మెంట్​ ప్లాన్ (జీపీడీపీ) కింద మరో అవార్డు దక్కింది. ఈ సందర్భంగా కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.