12 ఏళ్ల పిలగాడు ఎల్​ఈడీ బల్బులు చేస్తున్నడు

12 ఏళ్ల పిలగాడు ఎల్​ఈడీ బల్బులు చేస్తున్నడు

తల్లిదండ్రులు చేసే పనుల్ని చూసి పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలైతే, పెద్దయ్యాక వాళ్ల అమ్మానాన్నలు చేసే పనే చేయాలనేంతలా ఇన్​స్పైర్​ అవుతుంటారు. ఈ పిలగాడు కూడా ఆ కోవకే చెందుతాడు. చిన్నప్పట్నించి వాళ్ల నాన్న చేసే పనిని ఇంట్రెస్ట్​గా చూసేవాడు. అప్పుడప్పుడూ పనిలో సాయం చేసేవాడు. అలా ఆ పని నేర్చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పనినే తన వ్యాపారంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. చిన్న వయసులోనే పెద్ద ఆశయంతో ముందడుగు వేస్తున్నాడు.

గురంగ్ తయ వయసు పన్నెండేళ్లు. అరుణాచల్​ ప్రదేశ్​లో పుట్టిన గురంగ్​ తయ ఏడో క్లాస్​ చదువుతున్నాడు. వాళ్ల నాన్న గురంగ్​ రాజేష్, ఎల్​ఈడీ బల్బ్​లు తయారుచేసి, ప్యాక్​ చేసి మార్కెట్​కు అమ్ముతాడు. గురంగ్​ అప్పుడప్పుడూ వాళ్ల నాన్నకు సాయం చేస్తుంటాడు. అలా బల్బ్​ తయారుచేసేందుకు కావాల్సిన వస్తువుల పేర్లు తెలుసుకున్నాడు. ఆ తరువాత వాటిని తయారుచేయడం మీద ఇంట్రెస్ట్ కలిగింది. దాంతో వాళ్ల నాన్నని అడిగి బల్బ్​ తయారుచేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తనే బల్బ్​లు తయారుచేసి, ప్యాక్ కూడా​ చేస్తున్నాడు. ఎటువంటి కంగారు లేకుండా బొమ్మలతో ఆడుకున్నంత ఈజీగా వాటిని తయారు చేస్తున్నాడు. వీటి పేరు ‘కిమిన్​ ఎల్​ఈడీ బల్బ్’. వీటిని తయారుచేయడంలో పడి చదువు మానేయలేదు. స్కూల్​కి వెళ్తూనే ఖాళీ టైంలో, సెలవుల్లో ఈ పని చేస్తున్నాడు. అంతేకాదు, ఫ్యూచర్​లో ఎంట్రప్రెనూర్​ అవ్వాలనుకుంటున్నాడు. తయ​ బల్బ్​లను తయారుచేస్తుంటే.. తన ఫ్రెండ్​ నియా కూడా నేర్చుకుంటున్నాడు. ఇదంతా నిజమా? అనే డౌట్​వస్తే.. ఎల్​ఈడీ బల్బ్​ని గురుంగ్​ తయారుచేసిన వీడియో వెతికి చూడొచ్చు.