పన్నెండేళ్ల  పిలగాడు.. చిరుతతో ఫైటింగ్

పన్నెండేళ్ల  పిలగాడు.. చిరుతతో ఫైటింగ్
  • వేళ్లతో దాని కండ్లల్లో పొడిచి తప్పించుకున్నాడు

మైసూర్: ఓ పిలగానిపై చిరుత దాడి చేసింది. కానీ ఆ పిలగాడేం భయపడకుండా.. తెలివిగా ఎదుర్కొన్నడు. తన చేతి వేలితో చిరుత కంట్లో గుచ్చిండు. దెబ్బకు ఖంగుతున్న చిరుత.. అక్కడి నుంచి పారిపోయింది. అయితే లెపర్డ్ దాడిలో బాలుడి మెడ, భుజాలపై గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నాటకలోని మైసూర్ లో జరిగింది. కడకోలాకు దగ్గర్లోని బీరేనగౌడహుండీ గ్రామంలో నందన్ కుమార్ (12) ఫ్యామిలీకి ఫామ్ హౌస్ ఉంది. దాని పక్కనే కర్నాటక పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్)కు చెందిన 140 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. అదంతా చెట్లు, పిచ్చి మొక్కలతో అడవిలా తయారైంది. నందన్ సోమవారం ఫామ్ హౌస్ లో ఆవులకు మేత వేస్తుండగా.. అప్పటికే అక్కడికి దగ్గరలోని పొదల్లో నక్కిన చిరుత, పిల్లాడిపై దాడి చేసింది. వెంటనే రియాక్ట్ అయిన నందన్.. తన చేతి వేలితో చిరుత కంట్లో పొడిచిండు. భయపడిపోయిన చిరుత.. కుయ్యో, మొర్రో అంటూ వచ్చిన దారిలోనే పొదల్లోకి పారిపోయింది. అయితే చిరుత పంజా విసరడంతో బాలుడి మెడ, భూజాలపై గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఫ్యామిలీ మెంబర్లు.. అతడిని వెంటనే మైసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఊరోళ్ల ఆందోళన..

కేపీటీసీఎల్​కు చెందిన ఖాళీ స్థలమంతా అడవిలా తయారైందని, అందులోకి వచ్చిన చిరుతే… బాలుడిపై దాడి చేసిందని చుట్టుపక్కల ఊరోళ్లు చెప్పారు. వెంటనే ఆ స్థలాన్ని క్లీన్ చేయాలని కేపీటీసీఎల్ ఆఫీస్ ఎదుట వాళ్లంతా కూర్చుని ఆందోళన చేశారు. సాధారణంగా చిరుతలు మనుషులపై దాడి చేయవని రీజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గిరీశ్ తెలిపారు. ఇలాంటి కేసు జిల్లాలో ఇదే మొదటిదన్నారు. బాలుడికి ప్రమాదమేమీ లేదని, ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని
చెప్పారు.

ఇవి కూడా చదవండి 

సైనికులకు ఇక సూపర్ పవర్

సౌదీ చరిత్రలో మొదటిసారి.. ఆర్మీలోకి మహిళలు

గిరిసీమలో సేంద్రియ విప్లవం