
ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘120 బహదూర్’. పరమ వీర చక్ర పురస్కార గ్రహీత మేజర్ సైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ‘రాజీ’ ఫేమ్ రజనీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాశీఖన్నా కీలకపాత్ర పోషిస్తోంది. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం నేపథ్యంలో సాగే కథ ఇది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. మూడు వేలమంది చైనీస్ సైన్యంతో 120 మంది భారత సైన్యం ఎలా వీరోచితంగా పోరాడింది అనేది టీజర్‌లో చూపించారు.
సైనికులను ఉత్తేజపరిచేందుకు చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఈ యూనిఫాం ధైర్యం మాత్రమే కాదు.. త్యాగాన్ని కూడా కోరుకుంటుంది.. ఈరోజు ఆ క్షణం వచ్చింది..’ లాంటి డైలాగ్స్ ఇంప్రెస్ చేశాయి. నవంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత ఫర్హాన్ అక్తర్ మరోసారి బయోపిక్‌లో నటిస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.