
చైన్నై సూపర్ కింగ్స్ టీం మేనేజ్మెంట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ టీం యూఏఈకి వచ్చింది. ఈ సందర్భంగా కరోనా టెస్ట్ లు చేయగా అందులో 13మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది.అదనంగా నిర్వహించిన కరోనా టెస్ట్ ల్లో నెగిటీవ్ వచ్చింది. దీంతో టీం సభ్యులు క్వారంటైన్ లోకి వెళ్లారు.
తాజాగా నిర్వహించిన రెండో సారి టెస్ట్ లో నెగిటీవ్ వచ్చింది.సెప్టెంబర్ 3న నిర్వహించే టెస్ట్ ల్లో నెగిటీవ్ వస్తే..సెప్టెంబర్ 6నుంచి ప్రాక్టీస్ లో పాల్గొననున్నారు.
ఇక ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో వైదొలిగాడు.మరో ఆటగాడు హర్భజన్ సింగ్ టీమ్ తో రావాల్సి ఉండగా…ఆమె తల్లికి అనారోగ్యం కారణంగా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.