ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన 13 మంది శ్రీనివాసులు..

ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన 13 మంది శ్రీనివాసులు..

ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటది. అపుడు మల్లీశ్వరీ సినిమాలో క్లైమాక్స్ సీన్ గుర్తుకొస్తది. రైల్వే స్టేషన్లో హీరోయిన్  ప్రసాద్ అని పిలవగానే ఓ పది మంది వరకు లేచి నిలబడుతారు. నన్నేనా?  పిలిచింది అని.. ఇలాంటి సీనే ఇప్పుడు  కొత్తగా కొలువు దీరనున్న ఏపీ అసెంబ్లీలో రిపీట్ కానుంది. అవును మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ లు అనే పేరు గల వారు ఏకంగా 13 మంది ఎన్నికయ్యారు. మొత్తం 175 మంది ఉన్న ఏపీ అసెంబ్లీలో  శ్రీనివాస్ అని పిలిస్తే నన్నేనా? పిలిచింది నన్నేనా? అని అందరు స్పందించడం ఖాయం. ఒక్క సారి  ఆ 13 మంది శ్రీనివాసులు ఎవరనేది చూద్దాం..

  • కె.శ్రీనివాసరావు (ఎస్.కోట)
  • ముత్తంశెట్టి శ్రీనివాసరావు(భీమిలి)
  • గంటా శ్రీనివాసరావు (విశాఖ)
  •  చెల్లుబోయిన శ్రీనివాస్ (రామచంద్రపురం)
  •  జి.శ్రీనివాసనాయుడు(నిడదవోలు)
  • గ్రంథి శ్రీనివాస్ (భీమవరం)
  • పుప్పాల శ్రీనివాసరావు (ఉంగుటూరు)
  • ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్(ఏలూరు)
  • వెల్లంపల్లి శ్రీనివాసరావు(విజయవాడ వెస్ట్)
  •  గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నర్సరావుపేట)
  •  బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
  •  కె.శ్రీనివాసులు (కోడూరు)
  •  ఆరణి శ్రీనివాసులు(చిత్తూరు)