
ఆసిఫాబాద్, వెలుగు: కెరమెరి మండలం ఇందాపూర్లో పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుకర్ తెలిపారు. ఇందాపూర్కు చెందిన వడై పోశెట్టి తన పత్తి చేనులో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో మంగళవారం తనిఖీ చేసి 130 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. పోశెట్టిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మధుకర్ మాట్లాడుతూ.. గంజాయి సాగు చట్టరీత్యా నేరమన్నారు. గంజాయి సాగు చేసినా, అక్రమ రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.