
కాగజ్ నగర్ రూరల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఒక్క సీటు కోసం ఉమ్మడి జిల్లాలోని 294 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 131 మంది పరీక్షలకు హాజరయ్యారని నవోదయ ప్రిన్సిపల్ చక్రపాణి తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించి 25 గదుల్లో పరీక్షలు నిర్వహించామని తెలిపారు.