
హైదరాబాద్, వెలుగు : భూముల రిజిస్ట్రేషన్లపై ఎలక్షన్ ఎఫెక్ట్ పడింది. గత ఆర్థిక సంవత్సరంలో 19.47 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుగగా.. రూ.14,291 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో 16.31 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా.. రూ.13,270 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. ఇక 2019-–20 ఆర్థిక సంవత్సరంలో 16.59 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా..
తద్వారా రూ.7061 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి. ఆ ఏడాది కేవలం 12.10 లక్షల రిజిస్ట్రేషన్లు జరగగా...రూ.5,260 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది.