
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితాను శనివారం అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 230 ఎంపీటీసీ, 21 జడ్పీటీసీ, 21 ఎంపీపీ స్థానాలున్నాయి.
మొత్తంగా 1,347 పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు 7,52,259 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ముసాయిదాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8 వరకు తెలుపవచ్చని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. అన్ని మండల పరిషత్ ఆఫీసుల్లో పోలింగ్, ఓటరు జాబితాను అందుబాటులో పెట్టినట్లు స్పష్టం చేశారు.