
- ఢిల్లీలోని పిల్లల ఆశ్రమంలో
- ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 28 మంది మృతి
- విచారణకు ఆదేశించిన ఢిల్లీ మంత్రి అతిశీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో చిన్నారుల వరుస మరణాలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆశా కిరణ్పేరుతో ఢిల్లీ సర్కారు ఆధ్వర్యంలో నడుస్తున్న మెంటల్లీ చాలెంజ్డ్ పిల్లల ఆశ్రమంలో ఈ ఏడాది మొత్తం 28 మంది మృతిచెందారు. జనవరి నుంచి మే వరకు 14 మంది మృతి చెందగా.. ఒక్క జులైలోనే మరో 14 మంది మృతిచెందడం కలవరానికి గురిచేసింది. జనవరిలో ముగ్గురు మరణించగా.. ఫిబ్రవరిలో ఇద్దరు, మార్చిలో ముగ్గురు, ఏప్రిల్లో ఇద్దరు, మేలో ఒక్కరు, జూన్లో ముగ్గురు మృతిచెందారు.
జులైలో ఓ మహిళ, ఓ మైనర్ సహా 14 మంది చనిపోయారు. గతేడాది జనవరి నుంచి జులై వరకు 12 మంది చనిపోయినట్టు తెలిసింది. వీరి మరణాలకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి అతిశీ స్పందించారు. ఈ అంశంపై వెంటనే మెజిస్టీరియల్విచారణ జరిపి 48 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని రెవెన్యూ డిపార్ట్మెంట్కు శుక్రవారం ఆదేశాలిచ్చారు. కాగా, ఆశ్రమంలో చిన్నారుల వరుస మరణాలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కూడా విచారణకు ఆదేశించారు.