హైదరాబాద్ కమిషనరేట్ లో 14 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ

హైదరాబాద్ కమిషనరేట్ లో 14 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ అయ్యారు. వీరిని ట్రాన్స్ ఫర్ చేస్తూ హైదరాబాద్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. చాదర్ ఘట్ డిఐగా ఉన్న సీతయ్యను చిక్కడపల్లి ఎష్ఎచ్ఓగా,  తిరుమలగిరి పిఎస్ కు ట్రాఫిక్ డిఐగా అటాచ్ చేసిన గంట సంజీవ్ ను చాదర్ ఘట్ డిఐగా,  బోరబండ ఎస్ హెచ్ఓగా ఉన్న  కె రవికుమార్ ను సిసిఎస్ డిడికి, కామటిపుర డిఐగా ఉన్న ఎస్ విజయ్ ను బోరబండ ఎస్ హెచ్ఓగా,  అఫ్జల్ ఘంజ్ డిఐ పి లక్ష్మీకాంత్ రెడ్డిని సైఫాబాద్ ఎస్ హెచ్ఓగా,  సైఫాబాద్ ఎస్ హెచ్ఓగా ఉన్న ఎస్ రాజశేఖర్ ను ఎస్ బి సిటీకి బదిలీ చేశారు.

ఎస్ బి సౌత్ ఈస్ట్ జోన్ లోని గడ్డపాటి నరేష్ కుమార్ ను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ కు,  ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ లోని టి శ్రీనాథ్ రెడ్డిని ఎస్ బి సౌత్ ఈస్ట్ జోన్ కు, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ నుంచి చిట్టి బుర్రాను టాస్క్ ఫోర్స్ అడ్మిన్ కు, టాస్క్ ఫోర్స్ అడ్మిన్ నుంచి శ్రీరామ్ సైదా బాబును సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ కు, సైబర్ క్రైమ్స్ లోని ఎల్ భాస్కర్ రెడ్డిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ నుంచి  కొన్ని సైదులును సైబర్ క్రైమ్స్ కు,  ట్రాఫిక్ అడ్మిన్ నుంచి మధుసుదన్ బాదేను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ కు, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ లోని వై అజయ్ కుమార్ ను ట్రాఫిక్ అడ్మిన్ కు బదిలీ చేశారు.  బదిలీ అయిన ఇన్​స్పెక్టర్​లు వెంటనే తమకు కేటాయించిన పోలీస్​ స్టేషన్​లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు.