Pawan Kalyan : 'ఓజీ' నుంచి 'ఫైర్‌స్ట్రోమ్' సాంగ్ రిలీజ్.. మ్యూజిక్ సూపర్ అంటూ ఫ్యాన్స్ పండగ!

Pawan Kalyan : 'ఓజీ' నుంచి 'ఫైర్‌స్ట్రోమ్' సాంగ్ రిలీజ్..  మ్యూజిక్ సూపర్ అంటూ ఫ్యాన్స్ పండగ!

ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )  'హరిహర వీరమల్లు' ( Hari Hara Veera Mallu )  అభిమానులను ఎంతో నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.   నిరాశతో ఉన్న అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించేలా '  ఓజీ' ( OG )  సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దీని కోసం  ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ మేకర్స్ శుభవార్త అందించారు. ఈ సినిమా సంబంధించిన ' ఫైర్ స్ట్రోమ్ '  ( Firestorm )అంటూ సాగే తొలి లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

ఈ పాట గురించి సోషల్ మీడియాలో ఫుల్ చర్చ నడుస్తోంది. మ్యూజిక్ సూపర్ అంటూ అభిమానులు ఫోస్ట్ చేస్తున్నారు. ఈ పాట తమన్ ఇదివరకే కంపోజ్ చేసిన పాటల్లానే మంచి హైప్ తో తీసుకువచ్చారని ప్రశంసిస్తున్నారు.  లిరిక్స్ ని మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపిస్తుందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  ఈ సారి తమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు సినిమాకి థియేటర్ బాక్సులు బద్దలవ్వాల్సిందే అంటూ పవన్  అభిమానులకు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. 
 
ముంబై బ్యాక్ గ్రౌండ్ లో ఓ గ్యాంగ్ స్టర్ జీవితాన్ని ఆధారంగా ఈ ' ఓజీ " మూవీ రూపుదిద్దుకుంటుంది. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని ఒక కొత్త లుక్‌లో, శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది.  పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ చేస్తున్నారు. 

 సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్ గా కనిపించనున్నారు.  అర్జున్ దాస్ ,  శ్రియారెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ , అజయ్ ఘోష్  కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.