
బాంబేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో 22 ఏళ్ల విద్యార్థి, ఈరోజు ఉదయం అతను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ముంబైలోని పోవై ప్రాంతంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ హాస్టల్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ నివాసి అయిన రోహిత్ సిన్హా IIT బాంబేలో మెటలర్జికల్ సైన్సెస్‌లో నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. ఉదయం 2:30 గంటల ప్రాంతంలో అతను హాస్టల్ 10వ అంతస్తు నుండి దూకి మరణించాడు. ఆత్మహత్య చేసుకున్న వెంటనే రోహిత్‌ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు చెప్పారు.
Also Read : బీడీ, సిగరెట్, తంబాకు అలవాటు లేకపోయినా
సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రస్తుతం, ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేసుకొని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దీని వెనుక ఉన్న కారణాలు, అతని మొబైల్ ఫోన్, రూం, ఇతర విషయాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కానీ దీని పై ఇప్పటివరకు ఇన్స్టిట్యూట్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.