IT ఉద్యోగి కంటే వంటోడు ఎక్కువ సంపాదిస్తున్నాడు : ముంబై మహారాజ కథ వింటే నోరెళ్లబెడతారు..!

IT ఉద్యోగి కంటే వంటోడు ఎక్కువ సంపాదిస్తున్నాడు : ముంబై మహారాజ కథ వింటే నోరెళ్లబెడతారు..!

ఐటీ ఉద్యోగం.. అది కాకపోతే కార్పొరేట్ కంపెనీలో జాబ్.. వైట్ కాలర్ జాబ్.. మార్నింగ్ 5 టూ 6 జాబ్ అనుకుంటాం కానీ కాంపిటీషన్ లో అంతకు మించి వర్క్ చేయటం కామన్.. దీనికితోడు ట్రాఫిక్ ఒకటి.. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లి రావటానికి మరో 3, 4 గంటలు.. ఇంత చేసినా వచ్చే జీతం రెండు రోజులు కూడా ఉండదు.. పేరుతో పెద్ద ఉద్యోగం అయినా నెలాఖరుకు సేవింగ్స్ నిల్.. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. ముంబైలోని వంటోళ్లు సంపాదిస్తున్న డబ్బు చూసి.. ఇప్పుడు దేశమే నోరెళ్లబెడుతుంది.. ఒక్కో వంటోడు కనీసం 18 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు.. అది కూడా ఇద్దరికి.. ఒకే ఏరియాలో రోజుకు 10 ఇళ్లల్లో పని చేస్తూ.. ఎంచక్కా 2 లక్షలు వెనకేస్తున్నారంట.. అంతేనా టీ, కాఫీ, టిఫిన్, భోజనం అంతా ఫ్రీ.. ఇప్పుడు చెప్పటం మహారాజా ఎవరు.. ఇప్పుడు ఈ మహారాజా టాపిక్ సోషల్ మీడియాలో గోల గోల చేస్తుంది.. ఈ కథ పూర్తిగా తెలుసుకుందామా..

ALSO READ : మెటా AI వార్: 24 ఏళ్ల కుర్రోడికి రూ.2వేల కోట్ల శాలరీ ఆఫర్.. ఎవరీ మ్యాట్ డీట్కే?

ముంబైకి చెందిన కార్పొరేట్ లాయర్ ఆయుషీ దోషి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన అంశం పంచుకున్నారు. తన కుక్ నెలకు ఒకపూట ఇంట్లో వంట చేసేందుకు రూ.18వేలు వేతనంగా పొందుతున్నట్లు ఆమె చెప్పారు. ఆమె దాదాపు 30 నిమిషాల్లోనే వంట పూర్తి చేసుకుని వెళిపోతుందని చెప్పారు దోషి. తమ అపార్ట్మెంట్లోనే కుక్ దాదాపు 10-12 ఇళ్లలో పనిచేస్తూ నెలకు మంచి ఆదాయం పొందుతున్నట్లు చెప్పారు. ఒకే చోట పని వల్ల ప్రయాణ సమయం, ప్రయాణ ఖర్చులు కూడా తక్కువగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే ఆమెను మహారాజ్ అని ముద్దుగా పిలుచుకుంటానని దోషి వెల్లడించారు. 

 

ఇలా వంట చేస్తూ ఫ్రీ ఫుడ్, చాయ్ అందుకుంటోందని దోషి వెల్లడించారు. సమయానికి జీతం ఇచ్చేవారి ఇంట్లోనే పనిచేస్తుందని లేదంటే చెప్పాపెట్టకుండానే ఆమె పని మానేసి వెళ్లిపోతుందని చెప్పారు దోషి. ఆధునిక యుగంలో ఒక మిడ్ సీనియర్ లెవెల్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి నెల సంపాదనకు ఏమాత్రం తగ్గకుండా సదరు కుక్ రూ.2లక్షల వరకు పొందుతోంది. పైగా ఇందులో ఎలాంటి కట్టింగ్స్, టాక్సులు ఉండవు. 

దీనిపై నెట్టింట్లో యూజర్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. 30 నిమిషాల్లో వంట పూర్తి చేసే ఆమె.. అసలు వంట మనిషా లేగా ఏఐ వాడుతోందా అంటూ నోరెళ్లబెడుతున్నారు. మరొకరు తాము గురుగ్రాములో నెలకు రూ.6వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నామని.. ఫుల్ టైం కుక్ ను రూ.25వేలు ఇచ్చి పెట్టుకుంటే మూడు పూట్ల నచ్చిన వంటలు వండిపెడుతుందని కామెంట్ చేశారు. ముంబైలో ఈ రేటు సర్వసాధారమైనదేనని.. కావాలంటే తెలిసిన వాళ్లను కనుక్కోమని చెప్పింది. ఇంట్లో 12 మందికి ఒక రోజు వంట చేసేందుకు రూ.2వేల 500 వరకు అని చెప్పారు లాయర్ దోషి.