కరీంనగర్ జిల్లాలో ముక్కిన బియ్యం తిని.. మరో 14 గొర్రెలు మృతి

కరీంనగర్ జిల్లాలో  ముక్కిన బియ్యం తిని.. మరో 14 గొర్రెలు మృతి

వేములవాడరూరల్, వెలుగు: ముక్కిన బియ్యం తిని శుక్రవారం మరో 14 గొర్రెలు చనిపోయాయి. రెండు రోజుల కింద ఓ రైస్‌‌‌‌ మిల్‌‌‌‌లో ముక్కిన బియ్యం పొలాల్లో పారబోయగా.. గురువారం 55 గొర్రెలు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్​ఆదేశాల మేరకు సివిల్​సప్లై, పశుసంవర్ధక శాఖ అధికారులు రైస్​మిల్​వద్ద వేర్వేరుగా విచారణ చేపట్టారు. 

చనిపోయిన గొర్రెలకు వెటర్నరీ జిల్లా అధికారి రవీందర్​రెడ్డి, వేములవాడ వెటర్నరీ డాక్టర్​అభిలాష్​ పోస్టుమార్టం చేశారు. అస్వస్థతకు గురైన గొర్రెలకు చికిత్స అందించారు. గొర్రెల కాపరులు వంగరాజమల్లు, కేశవేని మల్లేశం, వేల్పుల మహేష్​లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైస్​మిల్​యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.