రాష్ట్రానికి 14 పోలీస్‌ మెడల్స్‌

రాష్ట్రానికి 14 పోలీస్‌ మెడల్స్‌

ఇద్దరు ఐపీఎస్‌లకు ప్రెసిడెంట్‌ మెడల్స్

హైదరాబాద్‌‌, వెలుగు: రిపబ్లిక్‌‌ డే సందర్భంగా ప్రకటించే పోలీస్‌‌ మెడల్స్‌‌ లిస్టును సెంట్రల్‌‌ హోం మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. రాష్ట్రం నుంచి 14 మంది మెడల్స్‌‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌‌ అడిషనల్‌‌ సీపీ శిఖాగోయల్‌‌, నిజామాబాద్‌‌ రేంజ్‌‌ ఐజీ ఎన్‌‌. శివశంకర్‌‌రెడ్డికి ప్రెసిడెంట్‌‌ పోలీస్‌‌ మెడల్‌‌ దక్కింది. మరో 12 మంది మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్‌‌కు సెలెక్ట్‌‌ అయ్యారు. సర్వీస్‌‌లో అందించిన ఉత్తమ సేవలకు గాను ఈ మెడల్స్‌‌కు సెలెక్టయిన అధికారులకు డీజీపీ మహేందర్‌‌రెడ్డి అభినందనలు తెలిపారు. సిటీ అడిషనల్‌‌ సీపీ శిఖాగోయల్‌‌ను సీపీ అంజనీకుమార్‌‌ అభినందించారు.

నిజామాబాద్‌‌ రేంజ్‌‌ ఐజీ ఎన్‌‌. శివశంకక్‌‌రెడ్డికి సిబ్బంది కంగ్రాట్స్‌‌ చెప్పారు. సెలెక్టయిన పోలీస్‌‌ అధికారులు ఢిల్లీలో మెడల్స్‌‌ అందుకోనున్నారు. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 946 పతకాలను కేంద్ర హోం శాఖ ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి ఇద్దరికి ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ, 205 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ, 89 మందికి  ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, 650 మందికి విశిష్ట సేవా పోలీస్ పథకాలు దక్కాయి.

సృజన్ రెడ్డికి ఉత్తమ్ జీవన్ రక్ష పదక్‌‌

ఫైర్ సర్వీస్‌‌లో మొత్తం 73 మందికి మెడల్స్‌‌ను  హోంశాఖ ప్రకటించింది. తెలంగాణ నుంచి వైఎన్ అన్నపరెడ్డి(డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్), జగదీశ్వర్ కట్ట (లీడింగ్ ఫైర్ మన్) లకు ఫైర్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ దక్కింది. జైళ్ల శాఖలో తెలంగాణకు 3పతకాలు లభించాయి. చీఫ్ హెడ్ వార్డర్‌‌లు వి చంద్రయ్య, గడ్డం సోమశేఖర్‌‌రెడ్డి, జి దైనమ్మలకు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. 2020 సంవత్సరానికి రాష్ట్రం నుంచి కోరిపెల్లి సృజన్ రెడ్డిని ఉత్తమ్ జీవన్ రక్ష పదక్‌‌ వరించింది.