రాయికల్, వెలుగు: ఇసుకు అక్రమ రవాణాపై మైనింగ్అధికారులు మంగళవారం కొరడా ఝులిపించారు. జగిత్యాల మైనింగ్ ఏడీ సింగ్, రాయికల్ తహసీల్దార్ నాగార్జున ఆధ్వర్యంలో సిబ్బంది రాయికల్ మండలం ఇటిక్యాల పెద్దవాగు నుంచి ఇసుక తరలిస్తున్న 14 ట్రాక్టర్లను పట్టుకున్నారు.
పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారంతో అధికారులు తమ సిబ్బందితో దాడిచేయడంతో ట్రాలీలను వదిలి ట్రాక్టర్ ఇంజన్లతో పరారయ్యారు. 14 ట్రాక్టర్లను పట్టుకొని మైనింగ్ శాఖకు అప్పగించినట్లు తహసీల్దార్ నాగార్జున తెలిపారు. ఈ దాడుల్లో ఆర్ఐలు పద్మయ్య, దేవదాస్, జీపీవోలు ఉన్నారు.
