బీ కేర్ ఫుల్ : భారీగా పెరిగిన రూ.500 దొంగ నోట్లు

బీ కేర్ ఫుల్ : భారీగా పెరిగిన రూ.500 దొంగ నోట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియా వార్షిక నివేదిక ప్రకారం..బ్యాంకింగ్ వ్యవస్థలో పట్టుబడిన రూ. 500 నకిలీ నోట్ల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 2022-23లో 14.6 శాతం..  91,110 నోట్లకు పెరిగాయని ఆర్బీఐ ప్రకటించింది. గతేడాది  500 రూపాయిల నకిలీనోట్లు  79,669 నకిలీనోట్లు(రూ.3.98 కోట్లు)ఉంటే ఈ ఏడాది 91,110 (రూ.4.55 కోట్లకు) నోట్లకుచేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించబడిన రూ. 2,000 డినామినేషన్‌లోని నకిలీ నోట్ల సంఖ్య  28 శాతం తగ్గి 9,806నోట్లకు చేరుకుంది. బ్యాంకింగ్ రంగంలో గుర్తించిన మొత్తం నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల సంఖ్య గతఆర్థిక సంవత్సరంలో 2,30,971 నోట్లతోపోలిస్తే 2022-23లో 2,25,769 నోట్లకు తగ్గింది. రూ.20 డినామినేషన్‌లో గుర్తించిననకిలీ నోట్లలో 8.4 శాతం పెరుగుదల, రూ. 500 (కొత్త డిజైన్) డినామినేషన్‌లో 14.4 శాతం పెరుగుదలను ఆర్‌బిఐ వార్షిక నివేదికలో హైలైట్ చేసింది. మరోవైపు రూ.10, రూ.100, రూ.2000 నకిలీ నోట్లు వరుసగా 11.6 శాతం, 14.7 శాతం, 27.9 శాతం తగ్గాయి.

కరెన్సీకి సంబంధించి ఆర్‌బీఐ  సమాచారం

2022-23లో కరెన్పీ  నోట్ల చెలామణి వరుసగా 7.8 శాతం, 4.4 శాతం పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య వరుసగా 9.9 శాతం, ఐదు శాతం.  మార్చి 31, 2023 నాటికి విలువ పరంగా చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో రూ.500, రూ.2,000 బ్యాంకు నోట్ల వాటా 87.9 శాతం. ఏడాది క్రితం ఈ సంఖ్య 87.1 శాతంగా ఉంది.

2000 నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఇటీవల రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. వాటిని డిపాజిట్ చేయడానికి లేదా మార్చడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది.  మార్చి 31, 2023 వరకు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ. 500 నోట్ల వాటా 37.9 శాతం. ఇది అత్యధికం. తరువాత రూ. 10 నోట్లు, దీని వాటా 19.2 శాతం. మార్చి 2023 చివరి నాటికి రూ. 500లకు సంబంధించి 5,16,338 లక్షల నోట్లు చెలామణిలో ఉన్నాయి. దీని మొత్తం విలువ రూ. 25,81,690 కోట్లు అని పేర్కొంది.

2000 నోట్ల చలామణి తగ్గింది

మార్చి నెలాఖరు నాటికి 4,55,468 లక్షల రెండు వేల రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ.3,62,220 కోట్లు అని కూడా నివేదిక పేర్కొంది. రెండు వేల రూపాయల నోట్ల చెలామణిలో విలువ, పరిమాణం రెండింటిలోనూ తగ్గుదల చోటుచేసుకుందని తెలిపింది. ప్రస్తుతం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇది కాకుండా ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నాణేలు కూడా చెలామణిలో ఉన్నాయి.

ఆర్బీఐ నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 వరకు చెలామణిలో ఉన్న ఈ-రూపాయి (టోకు),ఈ-రూపాయి (రిటైల్) విలువ వరుసగా రూ. 10.69 కోట్లు, రూ. 5.70 కోట్లు. 2022-23లో నోట్ల డిమాండ్, సరఫరా వార్షిక ప్రాతిపదికన 1.6 శాతం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రూ.20, రూ.500 (కొత్త డిజైన్)లో నకిలీ నోట్లు వరుసగా 8.4 శాతం, 14.4 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. మరోవైపు రూ.10, రూ.100, రూ.2000 డినామినేషన్లలో గుర్తించిన నకిలీ నోట్లు వరుసగా 11.6 శాతం, 14.7 శాతం, 27.9 శాతం తగ్గాయి.

నగదు రహిత నాణెం 

సాంకేతికతను ఉపయోగించడం ద్వారా నాణేల పంపిణీని మరింత మెరుగుపరచడానికి, రిజర్వ్ బ్యాంక్ ఐదు బ్యాంకుల (యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఫెడరల్ బ్యాంక్) సహకారంతో QCVM (QR కోడ్ ఆధారిత వెండింగ్ మెషిన్) పై పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. QCVM అనేది నగదు రహిత నాణేల పంపిణీ వ్యవస్థ, ఇది కస్టమర్ యొక్క మొబైల్ ఫోన్‌లో యంత్రం ద్వారా రూపొందించబడిన డైనమిక్ QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా UPI ద్వారా చెల్లింపు లావాదేవీలను అనుమతిస్తుంది. నగదు ఆధారిత సాంప్రదాయ నాణేల విక్రయ యంత్రాల వలె కాకుండా, QCVM బ్యాంకు నోట్ల భౌతిక టెండరింగ్ మరియు వాటి తదుపరి ప్రమాణీకరణ అవసరాన్ని తొలగిస్తుంది. ఇంకా, QCVMలలో, కస్టమర్‌లు అవసరమైన పరిమాణంలో మరియు విలువలలో నాణేలను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దేశంలోని 12 నగరాల్లోని 19 లొకేషన్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌ను మొదటగా అమలు చేస్తున్నారు.