సీఎం కార్యక్రమంలో బిర్యానీ తిని 145 మందికి అస్వస్థత

సీఎం కార్యక్రమంలో బిర్యానీ తిని 145 మందికి అస్వస్థత

బిర్యానీ తిని 145 మంది అనారోగ్యానికి గురైన ఘటన అస్సాంలో జరిగింది. వీళ్లు బిర్యానీ తిన్నది ఎక్కడో కాదు. స్వయాన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే. కార్బిఅంగ్లాంగ్ జిల్లాలోని దిఫు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం సర్బానంద సోనోవాల్ హాజరయ్యారు. అదేవిధంగా హెల్త్ మినిష్టర్ హిమంత బిస్వా శర్మ కూడా అటెండ్ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమం కావడంతో ఈ ప్రోగ్రాంకు దాదాపు 8 వేల మంది వచ్చారు. వీరందరికీ ప్యాక్ చేసిన బిర్యానీ ప్యాకెట్లను ఇచ్చారు. ఆ బిర్యానీ తిన్న వారిలో 145 మంది అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి మరియు వాంతులతో ఆస్పత్రిలో చేరారు. వారిలో 28 మంది బుధవారం డిశ్చార్జా కాగా.. మిగిలిన 117 మంది ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి మంగళవారం రాత్రి ఆస్పత్రిలో మరణించాడు. అయితే అతని మరణానికి ఫుడ్‌పాయిజనింగ్ కారణమా అనేది ఇంకా నిర్ధారించబడలేదు.

ఈ ఘటనపై స్పందించిన సీఎం సోనోవాల్.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బాధితులకు సరైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న హెల్త్ మినిష్టర్ హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ… తనకు కూడా కడుపునొప్పి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బిర్యానీ ప్యాకెట్లను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.

For More News..

రైతులకు సపోర్టుగా సెలబ్రిటీల ట్వీట్లు.. తెలుసుకొని మాట్లాడాలని కేంద్రం సీరియస్

కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంలో ఇండియా రికార్డ్