హనోయ్: ప్రపంచ అతిపెద్ద స్వేచ్ఛా వ్యాణిజ్య డీల్‌పై 15 ఆసియా-పసిఫిక్ దేశాలు ఆదివారం సంతకాలు చేశాయి. ఈ ట్రేడ్ డీల్ తన ప్రాభవాన్ని పెంచుకోవడంలో చైనాకు ఎంతో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏషియా దేశాలతోపాటు మరో ఐదు దేశాలు కలసి ఈ బ్లాక్ ఏర్పడింది. దీనికి రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ (ఆర్‌సీఈపీ)గా పేరు పెట్టారు. వియత్నాం రాజధాని హనోయ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆర్‌సీఈపీ దేశాలు పాల్గొన్నాయి.
ఈ బ్లాక్‌లో జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రూనై, బర్మా, కాంబోడియా, ఫిలిప్పెన్స్, థాయ్‌లాండ్ కూడా సభ్యులుగా ఉన్నాయి. ఆర్‌సీఈపీలో ఈ ప్రతిపాదనను 2012లో ప్రతిపాదించారు. అయితే చాలా కాలం తర్వాత ఎట్టకేలకు ఈ ప్రతిపాదనకు పలు దేశాలు మద్దతు తెలిపాయి. ఈ ఒప్పందంపై గతేడాది భారత్ తన అయిష్టతను తెలియజేసిన విషయం తెలిసిందే. తాజా డీల్‌తో దక్షిణాసియాలో చైనా పాత్ర మరింతగా పెరగనుంది. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో సభ్యదేశాలతో తన వ్యాపారాన్ని డ్రాగన్ పెంచుకోనుంది.
