భారత ఆర్మీ దాడిలో.. 15మంది పాక్ సైనికులు హతం

భారత ఆర్మీ దాడిలో.. 15మంది పాక్ సైనికులు హతం

లైన్ ఆఫ్ కంట్రోల్  (LoC) వద్ద  భారత సైన్యం జరిపిన దాడిలో 15మంది పాక్ సైన్యం, ఎనిమిది మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఆర్మీ అధికారులు మాట్లాడుతూ… ఈ ఘటన ఎప్రిల్ 10న జరిగిందని తెలిపారు.  కిషన్ గంగా నది ఒడ్డున పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ  దూద్‌నైల్‌పై దాడులు జరపాలనుకుందని చెప్పారు. ఇది పర్వత ప్రాంతమైన ఊరు అని తెలిపారు.   అప్పటికే సమాచారాన్ని అందుకున్న భారత సైన్యం అక్కడికి ముందుగానే చేరుకుందని… దాడులకు ప్రయత్నించిన  పాక్ సైన్యంపై, ఉగ్రవాదులపై, భారత ఆర్మీ విరుచుకుపడిందని చెప్పారు. దీంతో ఎనిమిది మంది   ఉగ్రవాదులు, 15మంది పాక్ సైన్యం చనిపోయారని తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు జమ్మూకు చెందిన వారని మిగితా వాళ్లు జైషే-మొహమ్మద్ నుంచి శిక్షణ పొందినట్లు తెలిపారు.

పాకిస్తాన్ కూడా దాడులు జరిగినట్లుగా దృవీకరించింది. అయితే ఇందులో 15ఏళ్ల బాలికకు మరో నలుగురికి గాయాలయినట్లు తెలిపింది. దీంతో పాటు కాల్పుల విరమణకు భారతే కారణమని చెప్పింది.