ప్రతి పార్సిల్​పై 15 శాతం కమీషన్

ప్రతి పార్సిల్​పై 15 శాతం కమీషన్
  •     గ్రేటర్ పరిధిలో కార్గో ఏజెంట్లు కావాలి: ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో కార్గో సేవలను మరింత విస్తరించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్లాన్​చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా మరికొంత మంది కార్గో ఏజెంట్లను నియమించాలని నిర్ణయించింది. కార్గో ఏజెంట్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్​ మేనేజర్(లాజిస్టిక్​) ఎస్.మధుసూదన్​సూచించారు. ఏజెంటుగా చేరేందుకు రూ.10 వేలు(నాన్ రిఫండ్)  చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ప్రతి పార్సిల్​పై15 శాతం కమీషన్​ ఇస్తామని, ఏజెంట్​తప్పనిసరిగా కంప్యూటర్, ప్రింటర్​కలిగి ఉండాలని చెప్పారు. ఏజెంట్లు బుక్​చేసిన పార్సిల్స్ ను ఎప్పటికప్పుడు ఆర్టీసీ కార్గో బస్సు కలెక్ట్​చేసుకుంటుందని స్పష్టం చేశారు. సమాచారం కోసం 91542 98781, 91529 8828, 89195 25373,98495 67204లో సంప్రదించాలని సూచించారు. 

మహిళా కండక్టర్​కు సన్మానం

ఫ్రెండ్లీ కండక్టర్​గా పేరు పొందిన రాజేంద్రనగర్​ డిపోకు చెందిన అనూపరాణిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం సన్మానించారు. ప్రయాణికులను తన కుటుంబ సభ్యులగా ట్రీట్​చేస్తూ, అంకితభావంతో పనిచేయడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఆర్టీసీకి డ్రైవర్లు, కండక్టర్లే బ్రాండ్​అంబాసిడర్లని తెలిపారు.