ఇద్దరు విద్యార్థులపై కాల్పులు జరిపిన 15ఏళ్ల బాలుడు

ఇద్దరు విద్యార్థులపై కాల్పులు జరిపిన 15ఏళ్ల బాలుడు

వాషింగ్టన్ లో ఓ 15ఏళ్ల బాలుడు తన తోటి విద్యార్థులపై కాల్పులు జరిపిన ఘటనలో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. లీస్ట్రీట్‌ వీధిలోని ఐడియా పబ్లిక్‌ చార్టర్‌ స్కూల్‌ బ్లాక్ వద్ద ఒక బాలుడు ఆ స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో  ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ బాలున్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు  పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలలో ఉన్న మిగతా 350మంది విద్యార్థులను, సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు.

ఈ ఏడాది సుమారు రెండు వేల అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వాషింగ్టన్‌ డీసీ మెట్రోపాలిటన్‌ పోలీస్‌ చీఫ్‌ తెలిపారు. గతేడాదితో పోల్చితే అదనంగా 800 అక్రమ ఆయుధాలు ఎక్కు ఉన్నాయని.. అదే రోజున వేరొక ఘటనలో ఒక భవనం వద్ద మరో బాలుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా దేశంలో తుపాకీ హింస పెరుగుతున్నందున అమెరికాలో ఆయుధాలను నిషేధించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.