మొహాలీలో చెలరేగిన జడేజా..150 నాటౌట్

మొహాలీలో చెలరేగిన జడేజా..150 నాటౌట్

మొహాలీ: శ్రీలంక‌తో జ‌రుగుతున్న ఫస్ట్  టెస్టులో ర‌వీంద్ర జ‌డేజా చెలరేగి ఆడుతున్నాడు. కీలక ప్లేయర్లు ఔట్ అయినప్పటికీ తనదైన స్టైల్లో హాఫ్ సెంచరీ, సెంచరీ పూర్తి చేయడమే కాకుండా ఏకంగా 150 బాదాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. టీ20 మ్యాచ్ లాగే బాల్స్ వేస్ట్ చేయకుండా ఆడాడు. దీంతో టెస్టుల్లో రెండ‌వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. రెండ‌వ రోజు భోజ‌న విరామ స‌మ‌యానికి ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల న‌ష్టానికి 468 ర‌న్స్ చేసింది. ఆల్‌రౌండ‌ర్ అశ్విన్, జ‌డేజాలు ఏడో వికెట్ 130 ర‌న్స్ భాగ‌స్వామ్యానికి జోడించారు. బౌండ‌రీల‌తో చెల‌రేగిన‌ అశ్విన్ హాఫ్ సెంచ‌రీ చేశాడు. 67 బంతుల్లో అత‌ను టెస్టుల్లో 12వ హాఫ్ సెంచరీ చేశాడు. 8 బౌండ‌రీల‌తో 61 ర‌న్స్ చేసిన అశ్విన్ లంచ్ బ్రేక్‌కు ముందు ఔట‌య్యాడు. అయితే రెండో రోజు తొలి సెష‌న్‌లోనూ ఇండియా డామినేట్ చేసింది.లంక బౌల‌ర్లు ఏ ద‌శ‌లోనూ ఇండియ‌న్ల‌ను ఇబ్బందిపెట్ట‌లేక‌పోయారు. ర‌వీంద్ర జ‌డేజా 160 ర‌న్స్‌తో ఇంకా క్రీజ్‌లో ఉన్నాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 17 బౌండ‌రీలు, 2 సిక్సులు ఉన్నాయి. 125 ఓవర్లు ముగిసేసమయానికి భారత్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 539 పరుగులు.