సౌదీ రాయల్ ఫ్యామిలీలో 150 మందికి కరోనా

సౌదీ రాయల్ ఫ్యామిలీలో 150 మందికి కరోనా

సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీని కరోనా వైరస్ వణికిస్తోంది. రాయల్ ఫ్యామిలీకి చెందిన వారు దాదాపు 15,000 మంది ఉన్నారు. వీరిలో 150 మందికి వైరస్ సోకినట్లు కన్ఫమ్ అయింది. దీంతో సౌదీ రాజు కింగ్ సల్మాన్ జెడ్డా సమీపంలోని ఐల్యాండ్ కు, యువరాజు (క్రౌన్ ప్రిన్స్) మహ్మద్ బిన్ సల్మాన్ రెడ్ సీ తీరంలోని ఓ మారుమూల ప్రాంతానికి ఐసోలేషన్ కోసం వెళ్లిపోయారు.

రాయల్ ఫ్యామిలీతో పాటు దేశంలోని ఇతర వీఐపీల కోసం రియాద్ లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ను సిద్ధం చేస్తున్నారు. వీఐపీలకు ప్రత్యేకంగా 500 బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కరోనా బారిన పడిన హాస్పిటల్ స్టాఫ్ ను సైతం ఇతర హాస్పిటళ్లకు షిఫ్టు చేయాలని నిర్ణయించారు. సౌదీ ప్రిన్స్ , రియాద్ గవర్నర్ బందర్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ కు కొవిడ్ వల్ల సీరియస్ కావడంతో ఐసీయూలో చేరారు. సౌదీలో 2,932 కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి. అయితే, దేశంలో 10 వేల నుంచి 2 లక్షల కేసులు నమోదు కావచ్చని చెప్తున్నారు. మక్కా, మదీనా, డహ్రాన్, హోఫుఫ్, దమ్మమ్ వంటి సిటీలన్నింటిలో కర్ఫ్యూ కొనసాగుతోంది.