దేశంలో లక్షన్నర దాటిన కరోనా కేసులు

దేశంలో లక్షన్నర దాటిన కరోనా కేసులు

భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో లక్ష 52 వేల 879 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజు వారీ లెక్కల పరంగా చూస్తే ఇప్పటివరకూ ఇదే అత్యధికం. దాంతో మొత్తం బాధితుల సంఖ్య కోటి 33 లక్షలకు చేరింది. శనివారం దేశవ్యాప్తంగా 839 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్ష 69 వేలు దాటింది. శనివారం 90,584 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 11,08,087 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల్లో 72 శాతం 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా.. ఒక్క మహారాష్ట్రలోనే 51 శాతం యాక్టివ్ కేసులుండటం గమనార్హం.