కారేపల్లి మండలంలో ఫారెస్ట్ ఆఫీసర్లపై .. దాడి చేసిన 16 మంది పై కేసు

 కారేపల్లి మండలంలో ఫారెస్ట్ ఆఫీసర్లపై .. దాడి చేసిన 16 మంది పై కేసు

కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మాణిక్యారం  ప్లాంటేషన్ పోడు భూమి వివాదంలో ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడిన 16 మందిపై కారేపల్లి పోలీస్ స్టేషన్ లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాణిక్యారం పరిధిలోని  ప్లాంటేషన్ పోడు భూమి వద్దకు వచ్చిన ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై ముగ్గురు సీపీఎం నాయకులతో పాటు 13 మంది పోడు సాగుదారులు గొడవ పడి దాడికి పాల్పడ్డారు.

 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శిల్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి పోలీసులు 16 మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు