
- 16 గేట్ల ద్వారా 49 వేల క్యూసెక్కులు విడుదల
- మిడ్‌మానేరుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. ఎగువ నుంచి 78 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. రిజర్వాయర్ నీటిమట్టం 79.26 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్ 16 గేట్లను ఎత్తి 49,280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే వరద కాల్వకు 20 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్‌కు 6,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 1500, సరస్వతీ కెనాల్‌కు 500, లక్ష్మీ కెనాల్‌కు 150 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. జల విద్యుత్ కేంద్రం ద్వారా 36.20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని జెన్‌కో ఆఫీసర్ తెలిపారు.
మిడ్‌మానేరుకు 19 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
బోయినిపల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మన్వాడలోని శ్రీరాజరాజేశ్వర (మిడ్ మానేర్) ప్రాజెక్ట్ భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీ నుంచి 15,782 క్యూసెక్కులు, గాయత్రి పంప్‌హౌస్ నుంచి 3,150, వరదల ద్వారా 100 క్యూసెక్కుల నీరువస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 17.079 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక్కడి నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు 9,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.