ముదిగొండ, వెలుగు: ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని చిరుమర్రి-సువర్ణాపురం ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 16 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.
సీఐ మురళీ ఆదేశాల మేరకు ఎస్సై అశోక్ ప్రత్యేక నిఘాతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన 16 ట్రాక్టర్లపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అంజి, అశోక్ తదితరులున్నారు.
